![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -926 లో.. మహేంద్ర దగ్గరికి అనుపమ వచ్చి జగతి విషయంలో మహేంద్రే దోషి అన్నట్లుగా మాట్లాడుతుంటుంది. అలా అనుపమ అనగానే మహేంద్రకి కోపం వస్తుంది. నిన్ను నమ్మి జగతిని నీ చేతిలో పెడితే ఇలా చేసావని అనుపమ అంటుంది. స్టాప్ ఇట్ అంటూ మహేంద్ర గట్టిగా అరుస్తాడు. అప్పుడే వసుధార, రిషి ఇద్దరు అక్కడికి వస్తారు. మరొక వైపు చాటుగా అనుపమ ఏం మాట్లాడుతుందని శైలేంద్ర వింటుంటాడు.
ఆ తర్వాత వసుధార, రిషి ఇద్దరు లోపలకు వచ్చి అనుపమని పలకరిస్తారు. రిషి చూసావా? అనుపమ ఎలా మాట్లాడుతుందోనని మహేంద్ర బాధపడుతు చెప్తాడు. మేడమ్ అమ్మ ఎలా చనిపోయిందనే విషయం మీకు మొత్తం చెప్పాను అయిన మీరు ఇలాగే మాట్లాడితే డాడ్ చాలా బాధపడుతాడని అనుపమతో రిషి అంటాడు. కాసేపటికి మహేంద్ర అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత వసుధార కాఫీ తాగి వెళ్ళండి అని అనుపమని అడిగితే.. భోజనం చేసి వెళ్తానని అనుపమ చెప్తుంది. ఆ తర్వాత రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడే శైలేంద్ర కీ ఫోన్ వస్తుంది. ఆ సౌండ్ విని ఎవరు ఎవరున్నారని వసుధార బయటకు వెళ్లేలోపు శైలేంద్ర గుర్తుపట్టకుండా ఉండాలని మొహానికి బ్లాక్ పెయింట్ పూసుకుంటాడు. ఆ తర్వాత బైక్ మీదుగా వెళదామని స్టార్ట్ చెయ్యబోతుంటే బైక్ స్టార్ట్ కాకా తోసుకుంటు వెళ్తాడు. అది వెనకాల నుండి వసుధార చూసి శైలేంద్రలా ఉన్నాడని ధరణి కి ఫోన్ చేసి శైలేంద్ర సర్ ఇంటి దగ్గర ఉన్నాడా అని అడుగగా.. ధరణి లేడని చెప్తుంది. మరొకవైపు శైలేంద్ర బైక్ ని తోసుకుంటూ వెళ్తాడు. ఒకతను చూసి ఏమైందని అడిగి.. నీ బైక్ బాగు చేస్తాను డబ్బులు ఇవ్వు అనగానే శైలేంద్ర డబ్బులు ఇస్తాడు. అవి తీసుకోని బైక్ కీ ఆన్ చేసి వెళ్ళండి అనగానే శైలేంద్ర షాక్ అవుతాడు. వసుధార నువ్వు పెట్టే టెన్షన్ కి బైక్ కీ కూడా ఆన్ చెయ్యడమే మర్చిపోయానని శైలేంద్ర అనుకుంటాడు.
మరొకవైపు అనుపమ, రిషి ఇద్దరు మాట్లాడుకుంటారు. జగతిని ఎన్ని రోజులు మహేంద్ర కీ దూరంగా ఉందని అనుపమ అనగానే.. డాడ్ బాధని చూడలేక నేనే వాళ్లని కలిపానని రిషి అంటాడు. దేవయాని అన్న మాటలు అనుపమ గుర్తుకు చేసుకొని.. నువ్వు మీ అమ్మని ఏమని పిలిచేవాడివని అడుగగానే.. మేడమ్ అని పిలిచేవాడిని అని రిషి చెప్తాడు. ఎవరైనా అలా పిలుస్తారా? నువ్వు నీ తల్లిని ఎంత బాధపెట్టి ఉంటావ్.. ఇదేనా ఇంకా ఏమైనా జగతిని బాధపెట్టిన విషయాలు ఉన్నాయా అని అనుపమ అడుగుతుంది. మేడమ్ మీరు ఇలా మాట్లాడితే నాకు చాలా బాధగా ఉంటుంది. ఇంకా డాడ్ కి ఎలా ఉందో.. ప్లీజ్ వీలైతే అమ్మా బాధ నుండి డాడ్ ని బయటకు తీసుకొని రండి అని రిషి చెప్తాడు. ఆ తర్వాత కాఫీ తీసుకొని రావాలా అని వసుధార అడుగుతుంది. నేనే కలుపుకుంటానని వసుధారతో అనుపమ లోపలికి వెళ్తుంది. మరొకవైపు శైలేంద్ర అవతారం చూసి దొంగ వచ్చాడనుకోని ధరణి కర్రతో కొడుతుంది. ఆ తర్వాత ధరణి.. నేను శైలేంద్ర ని అని చెప్తాడు. రెడీ అవ్వు బయటకు వెళదామని శైలేంద్ర అనగానే.. ధరణి హ్యాపీగా ఫీల్ అవుతుంది.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే
![]() |
![]() |